నా చిట్టితల్లి బ్రతకడమే నాకు కావాలి..

నా చిట్టితల్లి బ్రతకడమే నాకు కావాలి..

‘‘ఈ మందులు వేసుకుంటే నీ జుట్టురాలిపోవడం తగ్గిపోతుంది. అంతేకాదు జుటు నడుముల దాకా పెరుగుతుంది’’ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని రాలిపోయిన తన జుట్టుని చూసుకొని బాధపడుతున్న నా కూతురికి నేను చెప్పిన మాటలివి. ఆ మాటలు తనకు ఆ సమయంలో ఉపశమనం కలిగించాయి. తనకి పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టం. ఆల్బమ్స్ లోని నా ఫోటోలు చూసి.. ‘‘నేను త్వరగా పెద్దదాన్ని అయిపోతా. అప్పుడు నాకు కూడా నీలాగా పొడవాటి జుట్టు ఉంటుంది’’ అని చెప్పేది అమాయకంగా.

 

మా పాప పేరు హరిణి(9 సంవత్సరాలు). బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. తనకు ఆ విషయం తెలియదు. కేవలం జ్వరం రావడంతోనే తాను హాస్పటల్ కి వస్తున్నానని అనుకుంటోంది. ఇప్పటి వరకు మా పాపకి 22 కీమోథెరపీ సెషన్స్ పూర్తయ్యాయి. అయినా తనకి క్యాన్సర్ తగ్గలేదు. ఇంకా 8 సెషన్స్ చేయాల్సి ఉంది. నా పర్సులో కేవలం రూ.10 మాత్రమే ఉన్నాయి. కానీ నా కూతురిని నేను బ్రతికించుకోవడానికి కనీసం రూ.10 లక్షలు అవసరం. నాకున్నది హరిణి ఒక్కతే. అందుకే తనని బ్రతికించుకోవడానికి దాతల  సహాయం కోరుతున్నాను.

నా పేరు జెనిఫర్( హరిణి తల్లి). నా భర్త, కూతురితో కలిసి నేను బెంగళూరులో ఉంటాను. నేను ఒక సాధారణ గృహిణిని. నా భర్త ట్యాక్సీ డ్రైవర్. అతనికి నెలకి రూ.8వేలు జీతం. కానీ.. పాప కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ పనికి సరిగా వెళ్లకపోవడంతో ఆయనను పని నుంచి తొలగించేశారు. నేను పాప దగ్గర ఉంటే ఆయన హాస్పిటల్ బిల్లులు కట్టడం, మందులు కొనడం లాంటి పనులు చూసుకుంటున్నాడు. గడిచిన  7నెలల్లో మేము దాచిపెట్టుకున్న డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర పాపని బ్రతికించుకోవడానికి ఒక్క రూపాయి కూడా మిగలలేదు. కానీ.. పాప బ్రతకాలంటే ట్రీట్ మెంట్ కు  చాలా డబ్బు  అవసరం.

2017 ఏప్రిల్ లో హరిణికి బాగా దగ్గు, జ్వరం వచ్చింది. ఎంతకు అవి తగ్గక పోవడంతో ఆదుర్దగా తనను మేము హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాం. ఆ రోజు మేము ఎంత కంగారు పడ్డామో నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. బోన్ మ్యారో టెస్ట్ తర్వాత పాపకి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ మాట విన్నాక నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ క్షణం నుంచి తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. కానీ తన ట్రీట్ మెంట్ అయ్యే ఖర్చు ఎలా భరించాలి? మేము చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని డబ్బు కోసం వేడుకున్నాం. ఇప్పటి వరకు అయిన ఖర్చును కష్టపడి భరించాం. కానీ క్యాన్సర్ మొండికేసింది. దానిని నా కూతురి శరీరం నుంచి తరిమేయాలంటే చాలా చేయాల్సి ఉంది. ఇది చదివిన ప్రతి ఒక్కరూ దయచేసి మా కుమార్తె ట్రీట్ మెంట్  సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను.

నా కళ్లెదుట నా కూతురు పడేబాధంతా నేనూ అనుభవిస్తూ ఉన్నా. హారిణికి గుచ్చే సూది, దేహం లోకి ఎక్కించే పైపులు నాకూ గుచ్చకుంటున్నట్లున్నాయి.  ప్రతి వారం తన బ్లడ్ కౌంట్ ని మానిటర్ చేయాలని డాక్టర్లు చెప్పారు. మొదట్లో నీడిల్, పైపు పెట్టేటప్పుడు హరిణి చాలా బాధపడేది. ఇప్పుడు ఆ నరకానికి  హరిణి అలవాటు పడింది.సూది గాట్లకు బెదరడం మానేసింది. తానే అప్రయత్నంగా చేతులు చాస్తూ ఉంది. క్యాన్సర్ పెడుతున్నఈ నరకయాతనకు అలవాటు పడిందని  గర్వపడాలో ఏడ్వాలో  అర్థం కాని పరిస్థితి నాది.

కీమోథెరపీ చేస్తున్నప్పుడు హరిణి తట్టుకోలేకపోయేది. రెండు పైపులను తన చాతిలో పొడిచి.. వాటి ద్వారా తనకు మందులను ఎక్కించేవారు. పాపకి ఎనస్థీషియా ఇప్పించేందుకు కూడా మా దగ్గర డబ్బులేదు. ఇలా చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎనస్థీషియా ఇవ్వడానికి కనీసం రూ.8వేలు ఖర్చు అవుతుంది. అవి చెల్లించే స్థోమత మా దగ్గర లేకపోవడంతో ఎనస్థీషియా లేకుండా ట్రీట్ మెంట్ చేసేవారు. ఆ నోప్పితో తను బాధపడుతుంటో మా గుండెలు పిండేసినట్టు అయ్యేది.

కీమోథెరపి సెషన్ చేసిన ప్రతిసారీ తనకు ఎంతో ఇష్టమైన జుట్టుని కోల్పోయేది. అంతేకాదు.. తిన్నదంతా వాంతుల రూపంలో బయటకు వచ్చేది. తన పళ్లు బ్రౌన్ కలర్ లోకి మారిపోయాయి. తనను తాను అలా చూసుకోవడం హరిణికి అస్సలు ఇష్టం లేదు. ‘నేను ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉన్నాను?’ అంటూ అమాయకంగా అడుగుతోంది. తాను ఇప్పటికీ నువ్వు అందాల దేవతలా అన్నావని చెప్పి నమ్మించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను.

తనకు అందించే మెడిసిన్స్ చాలా ఖరీదైనవి. 5ఎంఎల్ మెడిసిన్ ఖరీదు రూ.49,400. ప్రతి కీమోథెరపి సెషన్ కి ఇలాంటి మెడిసిన్ తనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 8 కీమోథెరపి సెషన్స్ చేయాల్సి ఉంది. వాటికి 8 మెడిసిన్ బాటిల్స్ అవసరం. ఇప్పటివరకు పాప కోసం రూ.14లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు మా దగ్గర రూపాయి కూడా మిగల్లేదు. నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు.  ప్రతి తల్లికి లాగే ఆమె నా ప్రపంచం. ఏ తల్లి అయినా తన బిడ్డ బ్రతకాలనే కోరుకుంటుంది. దయచేసి నా కుమార్తె ట్రీట్ మెంట్ కి సహకరించండి. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.

6నేను తనని రేపు రక్త పరీక్ష కోసం తీసుకోని వెళ్లాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా కూతురి క్యాన్సర్ మీద నేను యుద్ధం ఎలా చేయాలి?

మీరు జెనిఫర్ కి సాయం చేయాలనుకుంటే  Ketto  నిధి సేకరణ ద్వారా చేయవచ్చు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page