ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల టెంపరేచర్ 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్  దాకా పెరగనుంది.

 రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వేసవి భగ్గున మండే లా ఉందని వాతావారణ శాఖ గట్టి హెచ్చరిక చేసింది.

సాధారణంగా ఉండేవేసవి కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుందని అది వడ దెబ్బలకు దారి తీస్తుందని ఈ శాఖ హెచ్చరించింది.

‘ గత ఏడాది ఉన్నంత తీవ్రంగానే ఈ ఏడాది కూడా ఎండలు ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రత కటే కనీసం ఒక డిగ్రీ ఎక్కువగ ఎండలుంటాయి,’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కె రెడ్డి చెబుతున్నారు.

ఈ వేసవిలో అంటే ఏప్రిల్ మే నెలలో కొన్ని రోజులలో ఎండవేడి 47 డిగ్రీల సెల్సియస్ దాకా వెళుతుందని, మిగతారోజులలో 45 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుందని ఆయన చెప్పారు.

గత రెండేళ్లలో తెలుగు నాట వందల సంఖ్యలో వేసవి వడదెబ్బకు మనుషులుపిట్టల్లా రాలిపోయారు.

2014 ఆంధ్రలో 448 మంది చనిపోతే 2015 లో 1369 మంది దాకా వడగాడ్పుల వల్ల చనిపోయారు. అయితే, చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష రుపాలయ ఎక్స్ గ్రేషియా చెల్లించే ప్రకటన రాగానే, అధికారిక మృతుల సంఖ్య ఇందుల మూడో వంతకు పడిపోయింది. ఆయన 2015 లో తెలంగాణాలో సుమారు 486 మంది చనిపోయారని అంచనా. కచ్చితమయిన సమాచారం లేకపోయినా, 2016 లో కూడా దాదాపు ఇదే రీతిగా వడదెబ్బబారిన పడ్డారు.

తెలుగు వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.