న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. రెండు రాష్ట్రాలను సవతి పిల్లల్లాగా ఎందుకు చూస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.

 నరేంద్రమోదీ.. భారత దేశానికి ప్రధాని.. జీజేపీ కి కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు పంజాబ్‌, హరియాణాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా.. 300మందికి పైగా గాయాలపాలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ దాడులతో కేంద్రానికి సంబంధం లేదని.. రాష్ట్రానికి చెందుతుందని చెప్పారు. న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

మోదీ దేశానికి ప్రధాని కానీ.. బీజేపీ కి కాదన్నారు.పంజాబ్, హర్యానాలు భారత్ లో భాగం కాదా..? ఈ రెండు రాష్ట్రాలను సవతి పిల్లల్లాగా ఎందుకు చూస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.

అంతకముందు హరియాణా ప్రభుత్వంపై కూడా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయ లబ్ధికోసమే పంచకులను తగలబడేలా చేస్తున్నారు.. ఆందోళనకారులకు మీరు లొంగిపోయారు. పరిస్థితిని తీవ్రతరం చేయడానికి మీరు అనుమతిస్తున్నారు’ అంటూ హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అత్యాచార కేసులో డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునిచ్చిన కొద్దిసేపటికే పంచకుల రణరంగంగా మారింది. డేరా మద్దతుదారులు, అనుచరులు హింసకు దిగిన సంగతి తెలిసిందే.