ఈ రోజు  ప్రపంచ చెనిక్కాయల దినోత్సవం

రాయలసీమకు,చెనిక్కాయకు విడదీయరాని,విడదీయలేని సంబంధం ఉంది....

నేను ముందే చెప్పాను మా నీళ్లలో, మా మట్టిలో ఏముందో తెలియదు గాని మా ప్రాంతంలో పండే చెనిక్కాయల విశిష్టతే వేరు...

మా చెనిక్కాయలతో చేసే ఏ వంటకమయిన రాయలసీమ ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది,అది చివరికి ఉత్త చెనిగిత్తనాల పొడి అయినా.

ఉరిమిండి అయినా!!!,

ఉడికేసిన లేదా కాల్చిన చెనిక్కాయలయిన!!!,

పచ్చిచెనిక్కాయలయిన!!!,

చెనిగిత్తనాల(విత్తనాలు, బెల్లం)పాగం పప్పు అయినా!!!,

వివిధ రకాలుగా పిండి వంటల్లో అయినా!!!

మసాలా కూరల్లో పచ్చి పొడియైన!!!

అమెరికాలో, పచ్చిమ దేశాల్లో వాడుతున్నట్లు peanut butter,peanut jelly sandwiches లాగా అయినా!!!

ఆవురావురుమని లాగియచ్చు...

చెనిక్కాయ పుట్టు పూర్వోత్తరాలు

చెనిక్కాయలను దక్షిణ అమెరికాలో ముఖ్యంగా,బ్రెజిల్, పెరు లలో క్రీస్తు పూర్వం 3600 లోనే పండిచారని ప్రతీతి... ( పురావస్తు ఆధారాలు లేకున్నా చెనిక్కాయ ఆకారం లో వారు తయారు చేసిన కుండల ఆధారంగా) యూరోపియన్ లు ముఖ్యంగా స్పెయిన్ వాళ్ళు దక్షిణ అమెరికాను సందర్శించి చెనిక్కాయలను యూరోప్ కి పరిచయం చేసారు,స్పెయిన్ వాళ్ళే మెక్సికో కు పరిచయం చేసారు.అయితే ఉత్తర అమెరికాకు ఆఫ్రికా వాళ్ళ ద్వారా చెనిక్కాయలను పరిచయయినా నేడు ఒక సంవత్సరానికి 2 నుంచి 2 1/2 బిలియన్ డాలర్ ల బిసినెస్ ఒక అమెరికాలోనే జరుగుతోంది.

ఇండియాకు చైనా ద్వారా చెనిక్కాయలను ప్రవేశపెట్టడం జరిగింది.ప్రపంచం లో ఇప్పటి గణాంకాల ప్రకారం చైనా, భారత్ లు మొదటి రెండు స్థానాల్లో పంట విస్తీర్ణం లో ఉత్పత్తి వున్నాయ్ తర్వాత స్థానాల్లో నెదర్లాండ్ అమెరికా లు వున్నాయ్.

అయితే మనకేంటి...

ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు అనేకన్నా పలానా చోట నుండి వచ్చి రాయలసీమ కరువును తట్టుకొని బతికి, కరువు సీమకు చిహ్నంగా మారింది నా చెనిక్కాయ.

దేశంలో, మా సీమలో చెనిక్కాయ ప్రస్థానం

నేడు దేశంలో చెనిక్కాయ పండే ప్రధాన రాష్ట్రాలలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లు మొదటి రెండు స్థానాల్లో వున్నాయ్,మిగిలినవి తమిళనాడు, కర్ణాటక,తెలంగాణ మిగిలిన రాష్ట్రాలలో అక్కడక్కడ పండుతాంది.

ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో చెనిక్కాయ పండీడంలో ఉందంటే ఆ గొప్పతనం అంతా మా అనంతపూర్,కర్నూల్,కడప,చిత్తూర్ తో కూడిన రాయలసీమోల్లదే అని సగర్వంగా ప్రతి రాయలసీమోడు చెప్పుకొచ్చు. రాయలసీమలో చెనిక్కాయ పండడానికి అనుకూలతలున్నాయి.మాములుగా అయితే జూన్ 2వ వారం లోగా వర్షాలు రాయలసీమకు వస్తాయి. వర్షాధారితమయిన రాయలసీమకు నైరుతి రుతుపవనాలు కీలకం ఆ కాలంలోనే చేన్లు దుక్కి దున్ని సాగు చేసుకొని పెట్టుకొంటారు. వాన వచ్చానే చెనిగితనాలు యిత్తడం మొదలు పెడతారు... ఒకవేళ సకాలంలో వాన రాకపోతే చెనిక్కాయ పోతాది, తెచ్చిన ఇత్తనాల లెక్కగుడా రాదు. అందుకే "రాయలసీమ లో వ్యవసాయం రుతుపవనాలతో జూదం అంటారు మా పెద్దలు".

ఉదాహరణకు, అనంతపూర్ చుట్టుపక్క గ్రామాలను నతీసుకుంటే జూన్ చివరిలో వర్షం వచింది. కొంత మంది ఆ అదునులో యిత్తుకున్నారు, కొంత మంది బయపడినారు .మళ్లీ జులై 2వ వారంలో వచ్చిన వర్షానికి దాదాపు అందరు యిత్తుకున్నారు. అయితే ముందు యితుకున్నోలవి పిందెలు పడాల్సిన టైం కి కూడా వాన రాక చెట్టుకు ఒకటో రెండో పిందెలు పడినయ్. మన్న ఆగస్ట్ చివర్లో వచ్చిన వర్షానికి చెట్లు ఏపుగా పెరిగినప్పటికి ఫలితం శూన్యం అనేకన్నా మా బరిగొడ్లకు మేతకు భయంలా అని చెప్పడం మేలేమో...

జులై లో వేసినోళ్ళ కు మాత్రం చెట్టుకు 10 నుండి 25 కాయల మధ్యలో పిందెలు పడి బలుస్తాండాయు...

(ఇక్కడే రాయలసీమ రైతుల కష్టాలు చెప్పాలనుకున్న వ్యాసం చాన పెద్దది ఆయితంది కాబట్టి మరొక సందర్బం లో క్షుణ్ణంగా తెలుసుకుందాం...)

చెనిక్కాయల విశిష్టత

చెనిక్కాయలలో వుండే గుణాలే చెనిక్కాయలకు అంత ప్రాముఖ్యతనిచ్చాయ్...

పాచ్చత్య దేశాల్లో పేదవాని ఆహారంగా ఉపయోగ పడింది. ముఖ్యంగా ఒకటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో అమెరికా, యూరోప్ దేశాల సైనికులకు ప్రోటీన్ సోర్స్ గా ఉపయోగ పడ్డాయ్ peanut butter, peanut jelly Sandwiches లు... ఇప్పటికి అమెరికాలో చెనిక్కాయల వ్యాపారం 2 నుండి 2 1/2 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందంటే అర్థం చేసుకోండి మన చెనిక్కాయల విలువ,

చెనిక్కాయలతో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వివిధ విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ లు,పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్ వున్నాయ్... ఇవి శక్తిని ఇవ్వటమే కాక వివిధ వ్యాధులు నుండి కాపాడుతాయ్...

1. సరయిన శరీర పెరుగుదలకు ప్రోటీన్ తోడ్పడుతుంది

2.చెడు కోలెస్టిరోల్ ని తగ్గించి మంచి కోలెస్టిరోల్ ను పెంచుతుంది.. ఉదా. ఒలీక్ ఆసిడ్ కరోనరీ వ్యాధులనుండి కాపాడుతుంది...

3. కడుపులో వచ్చే కాన్సర్ రాకుండా చెనిక్కాయలో వుండే యాంటాక్సిడెంట్ లు కాపాడుతాయ్

4 గుండె, నరాల, ఆల్జీమర్, మరియు వివిధ ఇన్ఫెక్షన్ లనుంది చెనిక్కాయలు తింటే రక్షణ ఉంటుంది...

5.రక్తపోటు తగ్గించి గుండె పోటు నివారించడం లో చెనిక్కాయల పాత్ర గొప్పది

6 ఉదకబెట్టిన చెనిక్కాయలలో యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ ఇవి ప్రి రాడికల్స్ ను తొలగించి కాన్సర్ ను నివారిస్తాయ్...

7 విటమిన్ ఈ ఉండటం వల్ల వహర్మ సౌందర్యం పెంచడమే కాక, వంద్యత్వాన్ని నివారిస్తుంది...

8. బి కంప్లెక్ విటమిన్ లు పుష్టిగా చెనిక్కాయలతో దొరుకుతాయి..

9.. వివిధ మినరల్స్ ఉండటం మూలంగా శరీర సమతుల్యత కాపాడుకోవచ్చు....

ఇన్ని సుగుణాలు ఉండబట్టే చెనిక్కాయలను గర్భిణీలకు సంపూర్ణ ఆహారం గా గుప్పెడు విత్తనాలు తీసుకోని అవగాహన ఉన్న డాక్టర్లు చెప్తారు( ప్రస్తుతమున్న అవగాహనలేని డాక్టర్ లు పాచ్చత్య దేశాల ప్రభావంతో వాళ్లనుట్స్,ఆల్మండ్, లాంటివి తినమని చెప్తారు .... వాటిలో ఏ గుణాలున్నాయో అవే గుణాలు చెనిక్కాయలలో వున్నాయ్)...

అందుకే "రాయలసీమ చిహ్నంగా చెనిక్కాయ చెట్టును పెట్టాలని నా ప్రతిపాదన"

(అనంతపురం చెనిక్కాయ చేలో రచయిత మురళీ క్రిష్ణ)