టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే షమీకి పలువురు మహిళలతో అక్రమ సంబధాలు ఉన్నాయని ఆయన భార్య హసీన్ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూడా.

కాగా.. తాజాగా షమీ ఓ యువతితో ఛాటింగ్ చేసిన మెసేజ్ ల స్క్రీన్ షార్ట్స్ ని హసీన్ బయటపెట్టింది. గతంలోనూ షమీ ఇతర మహిళలతో దిగిన ఫోటోలను, ఛాటింగ్ లను బయటపెట్టగా.. మరోసారి ఫోటోలను విడుదల చేసింది.

వాటిలో మంజుషా అనే అమ్మాయితో షమీ ఛాట్ చేసినట్టుగా ఉన్నాయి. కాగా.. మంజుషా.. అందరి ముందూ తన భర్త ను భాయ్ అని పిలుస్తూ ఉంటుందని.. కానీ రహస్యంగా వీరు చేసేపని వేరే అనియ హసీన్ పేర్కొన్నారు. షమీని రక్షించేందుకే మంజుషా ప్రయత్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.