టీం ఇండియా క్రికెటర్ షమీ.. తన భార్య హసీన్ జహాన్ పై ఎదురుదాడికి దిగాడు. నిన్నటి వరకు షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ.. ఆయన భార్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. షమీ.. హసీన్ పై ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. హసీన్ తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపించాడు.

‘‘ నాతో పరిచయం కాకముందే హసీన్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ పిల్లలు ఎవరు అని అడిగితే.. చనిపోయిన తన అక్క పిల్లలు అని చెప్పింది. మా పెళ్లి జరిగిన కొంత కాలం తర్వాత అసలు నిజం చెప్పింది. తనకు షఫీయుద్దీన్‌ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలే అని చెప్పింది. నేను షాక్ అయ్యాను.’’ అని షమీ మీడియాకు తెలియజేశారు.

2002లో హసీన్‌.. షఫీయుద్దీన్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విభేదాలు తలెత్తడంతో 2010లో అతనితో విడిపోయింది.  2012లో షమికి హసీన్‌తో పరిచయమైంది. ఆ తర్వాత 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ప్రస్తుతం వీరికొక పాప. హసీన్‌ ఫిర్యాదు మేరకు గృహహింస, హత్యాయత్నం కింద షమిపై కేసులు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.