భార్య‌పై అనుమానంతో అర్థరాత్రి దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌. ఆదిలక్ష్మీని గోడ కు గుద్దడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు చిన్నారు అనాథ‌లు అయ్యారు.

భార్య‌పై అనుమానంతో అర్థరాత్రి దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌. దీనితో న‌లుగురు చిన్నారు అనాథ‌లు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా సిద్ద‌వ‌టం మండలంలో భాకరాపేట గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆదిలక్షమ్మమ్మను భర్త రాజశేఖర్‌ హతమార్చాడు. అందుకు కారణం... భార్యపై అనుమానంతోనే ఆమెను దారుణంగా హత్య చేశారు.

పోలీసులు వివరాల ప్రకారం... జగిలి రాజశేఖర్ పోలీస్ హెడ్ కానిస్టెబుల్ గా పనిచేస్తున్నాడు. గత 7 సంవత్సరాల క్రితం ఇతనికి ఆదిలక్ష్మికి వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలు శ్రీ చరిత(6), సుదేశ్న్‌(5), నిషిత(4), సాహితి (3) కుమారులున్నారన్నారు. అయితే గ‌త‌ మూడు సంవత్స రాల నుంచి తరచూ భ‌ర్త‌ మద్యం తాగి ఆదిలక్ష్మిని అనుమానంతో వేధింపుల‌కు గురిచేస్తుండేవాడు. ప్రతి రోజూ భార్యను కొట్టేవాడన్నాడ‌ని పోలీసులు తెలిపారు. అది చివ‌ర‌కు హ‌త్య చేసే స్థితికి దారి తీసింద‌ని వారు పెర్కొన్నారు. 

 ఆదివారం తెల్లవారుజామున 3.30నిమిషాలకు భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ పెద్ద‌దై చివ‌ర‌కు ఆది ల‌క్ష్మిని హ‌త్య‌గాయించాడ‌ని పెర్కొన్నారు, చుట్టు ప‌క్క‌ల ఉన్న స్థానికుల ద్వారా విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఒంటిమిట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆది లక్ష్మికి చికిత్స కోసం ఆటోలో కడప రిమ్స్‌కు తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందిందనట్లు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా ఆదిలక్ష్మీని గోడ కు గుద్దడంతో మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. రాజశేఖర్‌ పరారీలో ఉన్నారని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.


మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి