చెన్నైలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలోని ఉద్యోగులు మన భోజనం పై మనసుపారేసుకున్నారు.
మనకైతే పొరుగింటి పుల్లకూరే రుచి.. ఇంట్లో పంచభక్ష పరమాన్నంతో వడ్డించినా ఇంతేనా అని నిట్టూరుస్తాం.
పాశ్యాత్య సంస్కృతిని అణువణువునా ఒంటబట్టించుకున్న మనకు మన భోజనం బోర్ కొట్టేస్తుంది. పాచిపోయిన వారి పిజ్జాలు, బర్గర్ లే మనకు అమృతంలా కనిపిస్తున్నాయి.
అందుకే ఎంత రేటైనా సరే క్యూలు కట్టి మరో వాటినే కొనేస్తున్నాం. వారం రోజులు ఫ్రిజ్ లో పెట్టి లొట్ట లేస్తూ తినేస్తున్నాం. దేశవాళి చికెన్ కు టాటా చెప్పి కెఎఫ్ సి చికెన్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం.
ఇండియాలో ఉన్న సరే... మన తిండి మనం తినడం ఎప్పుడో మరిచిపోయాం. ఫ్యాషన్ పేరుతో ఫారిన్ తిండికి అలవాటు పడిపోయాం.
కానీ, ఈ తెల్లోళ్లు అలా కాదు... పిజ్జాలు, బర్గర్ లు కాస్త పక్కన పెట్టి మన భోజనం పని పట్టడానికి ఇదిగో ఇలా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారు.
స్ఫూన్లు, ఫోర్క్ లు పక్కన పెట్టి అరిటాకులో వడ్డించిన మన భోజనాన్ని ఎంత అందంగా తింటున్నారు చూడండి.
ఈ వీడియో చూస్తే వాళ్లతో కలసి విస్తరి వేయించుకోవాలనిపించకమానదు.
వీళ్లంతా చెన్నైలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలోని ఉద్యోగులు. మన భోజనం పై మనసుపారేసుకొని చెన్నైలోని ఒక హొటల్ కు ఇలా క్యూ కట్టారు. కుటుంబమంతా కలసి వచ్చి మంచి విందు భోజనాన్ని మన స్టైల్ లో ఆరగించారు.
యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
