Asianet News TeluguAsianet News Telugu

లైట్ షోతో వెలిగిపోనున్న హంపీ నైట్ బజార్

  • హంపికి తిరిగి పునర్వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్న పర్యాటక శాఖ 
  • నైట్ బజార్ ని నిర్వహించేందుకు ప్రయత్నాలు  
  • వచ్చే డిసెంబర్ నెల నాటికి ఈ నైట్ బజార్ ఏర్పాటు
Hampi By Night not before December

విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతి రూపం హంపి. శ్రీకృష్ణ దేవరాయులు పాలించిన ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అందుకే ప్రతి ఏటా హంపిని సందర్శించేందుకు వేలల్లో ప్రజలు అక్కడికి వెళతారు. అయితే.. కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మించినది కవాడంతో.. అక్కడి కొన్ని ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకున్నారు. దీంతో పర్యాటకంగా కాస్త వెనుకపడిందనే వాదనలు కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. అందుకే హంపికి తిరిగి పునర్వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు.

 

ఇదులో భాగంగానే అక్కడ నైట్ బజార్ ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే డిసెంబర్ నెల నాటికి ఈ నైట్ బజార్ ఏర్పాటు చేయడం పూర్తౌతుందని అధికారులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన దాదాపు 19 ప్రదేశాలను రీమోడలింగ్ చేస్తున్నారు. కళ్లు చెదిరేలా లైటింగ్ లు ఏర్పాటు చేయనున్నారు. పగలు పూట మాత్రమే కాకుండా రాత్రి సమయాలలో కూడా హంపీని సందర్శించేలా చేస్తున్నారు. పర్యాటకులు అక్కడ ఎక్కువ సమయం గడిపేలా.. మరింత ఎక్కువ మందిని ఆకర్షించేలా..అక్కడ దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 

హంపీ వరల్డ్ హెరిటేజ్ ఏరియా మేనేజ్ మెంట్ అథారిటీ, టూరిజం డిపార్ట్ మెంట్, బల్లారి డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ రీ మోడలింగ్ చేసేందుకు 19 ప్రదేశాలను గుర్తించారు. ఆ జాబితాలో యెడియూర్ సిద్ధ లింగేశ్వరాలయం, కోదండరామ ఆలయం, నదేదండె గుహ, విరుపాక్షాలయం, చక్రతీర్థ, కోటిలింగ, హస్తగిరి రంగనాథ స్వామి ఆలయం, సులే బజార్, అచ్యుతరాయ టెంపుల్, వరాహ ఆలయం, విష్ణు ఆలయం, సుగ్రీవ గుహలు, పుష్కరిణి, పురాతన బ్రిడ్జ్, తుల పురుషదాన, ఉగ్ర నరసింహ ఆలయం, గెజ్జాల్ మంటపం తదితర ప్రదేశాలు ఉన్నాయి.

 

ఈ ప్రదేశాల్లో సౌండ్ లైట్ షో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. పనులు వేగవంతగా జరగుతున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios