ఫేస్ మాస్క్ తో ‘యాపిల్’ కి బురిడి..!

Hackers just broke the iPhone X Face ID using a 3D printed mask
Highlights

  • యాపిల్ ని హ్యాకర్లు బురిడీ కొట్టించారు
  • ఐఫోన్ ఎక్స్ లో ఫేస్ ఐడీ ఫీచర్
  • ఫేస్ మాస్క్ తో ఫోన్ ని అన్ లాక్ చేసిన హ్యాకర్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ ని హ్యాకర్లు బురిడీ కొట్టించారు. యాపిల్ సంస్థ తన పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల ఐఫోన్ ఎక్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేని ఫేస్ ఐడీని ఇందులో ప్రవేశపెట్టారు. అంటే.. ఫింగర్ ప్రింట్ తో ఫోన్ అన్ లాక్ ఎలా చేస్తున్నామో అదేవిధంగా ఫేస్ తో చేయడమనమాట. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని యాపిల్ ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టారు. అయితే.. ఇప్పుడు ఆ ఫేసర్ ఐడీ ఫీచరే యాపిల్ కి సమస్యగా మారింది.

అసలు విషయానికి వస్తే.. వియత్నాంకు చెందిన బికావ్‌ అనే ఓ సంస్థ మాస్క్‌ను ఉపయోగించి ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసింది. 200డాలర్ల ఖర్చుతో తయారు చేసిన 3డీ ఫేస్‌ మాస్క్‌ను ఉపయోగించి ఫేస్‌ఐడీ ఫీచర్‌ను బురిడీ కొట్టించింది. ఈ మొత్తం ప్రక్రియను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. వాస్తవానికి ‘రిక్వైర్‌ అటెన్షన్‌’ అప్షను ఆన్‌ చేస్తే ఫేస్‌ఐడీ ఫీచర్‌కు మరింత అదనపు భద్రతను జోడిస్తుంది. దీని ప్రకారం మీరు ఫోన్‌వైపు నేరుగా చూడకపోయినా.. కళ్లు మూసుకుని ఉన్నా ఫోన్‌ అన్‌లాక్‌ అవదు. కానీ ఈ వీడియోలో సదరు సంస్థ ఈ ఆప్షన్‌ను ఆన్‌ చేసి ఉంచినప్పటికీ ఓ మాస్క్‌ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి చూపించింది. అంతేకాదు.. ఫేస్ మాస్క్ తో అన్ లాక్ చేయడాన్ని వీడియో తీసి వారి బ్లాగ్ లోనూ పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూశాక.. ఐఫోన్ ఎక్స్ వినియోగదారుల్లో ఫేస్ ఐడీ ఫీచర్ మీద అనుమానాలు మొదలయ్యాయి. మరి దీనికి యాపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

loader