Asianet News TeluguAsianet News Telugu

ప్రవాసులను పట్టించుకోరా : రేపు ‘ తెలంగాణా గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే’

అధికారంలోకి వచ్చి  33 నెలలు గడిచిపోయాయి, ఇచ్చిన హామీల అమలు చేయడం లేదు. ఈ బడ్జె ట్ లో గల్ఫ్ ఎన్నారైల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.తెలంగాణ ప్రవాసీ విధానం రూపకల్పనకు జులై 27న తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ ప్రవాసి సంఘాలు, నిపుణులతో సమావేశం జరిపి 8 నెలలయింది.ఎలాంటి ఫలితం లేదు.

gulf migrants to observe Telangana Gulf workers demands day tomorrow

రేపు అంటే ఏప్రిల్ 14 న అన్ని గల్ఫ్ దేశాలలోని తెలంగాణ ప్రవాసి కార్మికులు 'తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే' గా పాటించాలని నిర్ణయించారు.

శుక్రవారం సెలవు దినం కాబట్టి,  ప్రవాసి తెలంగాణేయుల తమ  రూంలోనే  సమావేవమయి. కేవలం ఒక నిమిషం పాటు  డిమాండ్ ఏమిటో  మాట్లాడుతూ వీడియో రికార్డింగ్ చేయాలని, ఈ వీడియోని ఒక ఫోటోతో కలసి  పేస్బుక్ పేజీలో అప్లోడ్ చేయాలని  కొయలిషన్ ఆఫ్ వోవర్ సీన్ తెలంగాణా అసోసియేషన్స్( సిఒటిఎ), ప్రవాసి మిత్ర లు విజ్ఞప్తి చేశాయి. ఫొటోలో ఉన్నవారి పూర్తి పేరు, మొబైల్ నెంబర్, సొంత ఊరు, నివిసిస్తున్న  దేశం పేరు రాయలాని. వీలయితే ట్విట్టర్, వాట్సప్ లలో కూడా షేర్ చేయాలని ఈ సంస్థలు కోరాయి. 

గల్ఫ్ దేశాలలో ఉన్న10 లక్షల మంది వలస జీవులు  ఉన్నారని, వారంత ఒకచోట కలుసుకోవడం సాధ్యం కానందున ఇలా ఉన్న చోటునుంచే ప్రవాస తెలంగాణేయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు   ఈ మార్గం ఎంచుకోవడం జరిగిందని ఈ సంస్థలు తెలిపాయి.

 

అధికారం లోకి వచ్చి 34 నెలలైనా ప్రవాసులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం

 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో, మరో 10 లక్షల మంది అమెరికా తదితర దేశాలలో నివసిస్తున్నారు. 'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక-2014 లో పలు హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది, 33 నెలలు గడిచిపోయాయి, ఇచ్చిన హామీల అమలు చేయడం లేదు. ఈ బడ్జెలో గల్ఫ్ ఎన్నారైల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. తెలంగాణ ఎన్నారై (ప్రవాసీ విధానం) రూపకల్పనకు జులై 27న తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ ప్రవాసి సంఘాలు, నిపుణులతో సమావేశం జరిపి 8 నెలలు గడిచిపోయాయి, ఎలాంటి ఫలితం లేదని ఈ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ సంఘాల  చేస్తున్న డిమాండ్లివి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు

* ఈ బడ్జెట్ లో గల్ఫ్ ప్రవాసీల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించాలి


* తెలంగాణ రాష్ట్రం లో ప్రత్యేకంగా ప్రవాసి సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి. 


 * సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి 


* విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) చెల్లించాలి. 


* గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ), ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ తో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాలన్నిటిలో కలిపి తెలంగాణ ప్రవాసులు వివిధ కారణాలతో సంవత్సరానికి 200 కు పైగా చనిపోతున్నారు. వీరిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు గత రెండున్నర ఏళ్లలో సుమారు 500 మంది తెలంగాణ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకున్నాయి.


* ఏర్ పోర్ట్ లో ఒక హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాలి. 


* విదేశాల నుండి వచ్చే మృతదేహాలను హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి వారి స్వగ్రామాలకు తరలించడానికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధనను సడలించి అందరికీ అంబులెన్సు ఇవ్వాలి. 


* రాష్ట్రం నుండి విదేశాలకు వలస వెళ్ళిన వారి వివరాలను సేకరించడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలి. సర్వే ఖర్చును కేంద్రం సగం భరించడానికి సిద్ధంగా ఉన్నది. సర్వే లో వలసకు కారణాలు, సామాజిక, ఆర్ధిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయస్సు, ఏయే దేశాలకు ఏయే జిల్లాలవారు వెళుతున్నారు అనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా వారి సంక్షేమానికి తగిన ప్రణాళికలు వేయవచ్చు. 


* రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విదేశీ వలసలపై అధ్యన కేంద్రాలను నెలకొల్పాలి. 


* విదేశాలకు వలస వెళ్ళే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి. 


* కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్ళే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి. విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వీరి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలి. 



* విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి. 



* భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్ పి ఎస్) లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం కార్యక్రమమాలు నిర్వహించాలి. 


* ప్రవాసులు అవార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధరంగాలలో విశిష్టసేవలు అందించిన 62 మందికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొదటి వేడుకల్లో, రెండవ వేడుకల్లో కూడా ప్రవాస తెలంగాణీయుల్ని ప్రభుత్వం విస్మరించింది.

కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి:

*ఎంబసీ లలో తెలుగు అధికారులను నియమించాలి 


* హైదరాబాద్ లో సౌదీ ఎంబసీ ని ఏర్పాటు చేయాలి 


* ప్రవాసి భారతీయ బీమా యోజన' లో జీవిత బీమాను చేర్చాలి, రెనివల్ సౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం ఈ పథకం ECR పాస్ పోర్ట్ కలిగిన వారికి మాత్రమే ఇస్తున్నారు. ECNR పాస్ పోర్ట్ హోల్డర్స్ కు కూడా ఇవ్వాలి

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios