Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ దెబ్బని కప్పిపుచ్చుకుంటున్న బిజెపి, కాంగ్రెస్

రెండు ప్రధాన పార్టీలకు గుజరాత్ లో దెబ్బ తగిలింది

Gujarat results not so good news for both BJP and Congress

అత్యంత హోరాహోరీగా జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు రెండు ప్రధాన పార్టీలకు కనువిప్పు కలిగించాలి. ఫలితాల పట్ల పైకిసంతోషం వ్యక్తం చేసున్న వాస్తవ పరిస్థితి పండగ జరుపుకునేంతగా అటూ బిజెపికి గాని, ఇటు కాంగ్రెస్ కు గాని లేదు.బిజెపి ఎన్నికల్లో గెలిచిన మాట నిజం. వరుసగా ఆరోసారి గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటుచేసి బెంగాల్ కమ్యూనిస్టుల రికార్డును చేరుకున్న మాట నిజమేగాని, ఆ పార్టీకి తగిలిన దెబ్బ చాలా పెద్దదే. గుజరాత్ ను మోడల్ స్టేలల్గా ప్రధాని ప్రచారం చేశారు. దేశాన్నంతా ఆయన గుజరాత్ లాగా మారుస్తానన్నారు. అన్నింటికి గుజరాత్ మోడల్ ఫరిష్కారమన్నారు. తీరా చేస్తూ అక్కడ మోదీగారి పార్టీకి వందసీట్లు రావడం కష్టమైపోయింది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని అందుకే బిజెపికి వోటేశారని ప్రధాని మోదీ స్పందించారు. ‘అభివృద్ధితోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. జీఎస్టీ వల్ల యూపీ, గుజరాత్‌, హిమాచల్‌లో బీజేపీ ఓడిపోతుందని ప్రచారం చేశారు. ప్రజలు మాత్రం జీఎస్టీని అంగీకరించి.. మాకు అండగా నిలిచారు. దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి,’ అని ప్రధాని అన్నారు. అయితే,  కాంగ్రెస్ పరిస్థితి గతంలో కంటే బలపడేందుకు కారమేమిటనేదానికి ప్రధాని స్పందనలో సమాధానం లేదు.పైకి కనిపించినంత  సంతోషంగా ప్రధాని లోన ఉండగలరా? ఇదే ప్రశ్న సినీ నటుడు ప్రకాశ్ కూడా వేస్తున్నారు.

ఇంకా కాంగ్రెస్ పరిస్థితి తీసుకుందాం. ఆ పార్టీ రాహుల్ నాయకత్వంలో పోరాడిన తొలిఎన్నిక ఇది. సోనియా గాంధీ అసలు ప్రచారం చేయనేలేదు. యువనాయకుడు దాదాపు రెండు నెలల పాటు అక్కడ ప్రచారం చేశారు.ఈ సారి సోషల్ మీడియా కూడా బిజెపికి ఎదురుదెబ్బ తప్పని హంగామా తప్పింది. బిజెపి వోడిపోతున్నదని చెప్పింది. ఇంతచేశాక, పార్టీ పరాజయం పాలయింది. కాకపోతే, సీట్ల సంఖ్యపెరిగిందని పార్టీ చంకలెగరేసుకోవాలి. రాహుల్ ఆనందం కోసం రాహుల్ శకం మొదలయిందని, రాహుల్ నాయకత్వంలో పార్టీ సీట్లు పెరిగాయని చప్పట్లు కొట్టాలి. రాజస్థాన్ కాంగ్రెస్ నేత ‘గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ చాలామంచి ప్రచారాన్ని నిర్వహించింది. రాహుల్‌ ప్రచారం సాగించిన తీరు ఇందిరాగాంధీని తలపించింది’ అని ఆయన అన్నారు.

2012   అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

బిజెపి :116 , సీట్లు  పోలయిన వోట్లు 52  శాతం

కాంగ్రెస్ :60  సీట్లు, పోలయిన వోట్లు  41 శాతం

ఓటమి ఓటమే.. గెలుపు గెలుపే. భవిష్యత్తులో  కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందో, దిగజారుతుందో ఎవరు వూహించగలరు. గుజరాత్ లో కాంగ్రెస్ మరొక  అయిదేళ్లు ఆగాలి.

అయితే, ఒక్కటి మాత్రం కరెక్టు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతం కాలేకపోయింది. అదొక పెద్ద లోపం. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలసి పోటీ చేసి ఉంటే పరిస్థితి ఇంతకంటే మెరగ్గా ఉండేది.కాంగ్రెస్ కు ఇదొక గుణ పాఠం.అయితే,   గుజరాత్‌ ఫలితాలు ఎలా ఉన్నా  నైతిక విజయం తమదేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గెహ్లాట్ పేర్కొన్నారు. అదే బెంగాల్ ముఖ్యమంత్రి మమత కూడా ఇది బిజెపి నైతిక పరాజయం అని పేర్కొన్నారు. ఇలా బిజెపి వ్యతిరేకులంతా చేతులు కలపకపోతే, 2019లో బిజెపి మళ్లీ వస్తుందని గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీలలో గుబులు మొదలయిందని చెప్పక తప్పదు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios