మాంజాపై నిషేధం విధించిన గ్రీన్ ట్రిబ్యునల్

పతంగుల ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. ఇకపై ఆకాశాన్ని ముద్దాడేలా కైట్ లను ఎగిరేసే చాన్స్ మనకు ఉండకపోవచ్చు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పతంగులకు ఉపయోగించే ‘మాంజా’ దారంపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

గాజు, లోహాల పొడితో తయారు చేసే మాంజాను ఉపయోగించడం వల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులకు ప్రమాదకరమని గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంత్ర కుమార్ నేత‌ృత్వంలోని బెంచ్ తెలిపింది.

సంజయ్ హెగ్డే, షాదన్ ఫరాసత్ వేసిన పిటిషన్ మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చింది.

మాంజా పర్యావరణానికి హాని చేస్తుందని చెబుతూ తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.