ఆఫ్ఘాన్‌ జట్టుకు టెస్ట్ హోదా: ఐసీసీది తొందరే: అజహరుద్దీన్

Granting Test status to Afghanistan a hasty decision by ICC: Mohammad Azharuddin
Highlights

ఆప్ఘనిస్థాన్‌కు టెస్ట్ హోదాపై అజహరుద్దీన్ స్పందన

న్యూఢిల్లీ: టెస్ట్ మ్యాచ్ లు ఆడడానికి ఆప్ఘానిస్థాన్ జట్టు ఇంకా అలవాటు పడాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజహారుద్దీన్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘానిస్థాన్ జట్టుతో ఇండియా క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడడంపై  అజహరుద్దీన్ స్పందించారు. 

టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఆఫ్ఘానిస్థాన్ జట్టుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఫార్మాట్ లో లోపాలను అధిగమించేందుకు భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆ జట్టుకు పాఠాన్ని నేర్పుతోందన్నారు. 

పరిమిత ఓవర్లు, టెస్ట్ మ్యాచ్ లకు మధ్య వ్యత్యాసం ఉంటుందని అజహర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘానిస్థాన్ జట్టుకు టెస్ట్ హోదా ఇచ్చి ఐసీసీ తొందరపడిందేమోనని అజహర్ అభిప్రాయపడ్డారు. ఇంకా కొంత కాలం సమయాన్ని ఇవ్వాల్సిందని ఆయన చెప్పారు. తమ లోపాలను అధిగమించేందుకు  భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆఫ్టాన్ జట్టుకు ఉపయోగపడుతోందన్నారు.


పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టి, ఇంగ్లాండ్‌లో జరగనున్న 2019ప్రపంచకప్‌కే అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంచలనాల అఫ్గానిస్థాన్‌ టెస్ట్ ఫార్మాట్‌లో కుప్పకూలిపోయింది.. బంతితో ఆకట్టుకున్నట్లు కనిపించినా, బ్యాటింగ్‌ విషయంలో మాత్రం తడబడింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ కూడా ఇవ్వలేక రెండు సార్లు ఆలౌటై, 262పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది.
 

loader