Asianet News TeluguAsianet News Telugu

గణేశుడి ఎత్తు కాదు.. భక్తి ముఖ్యం..!

  • మట్టితో చేసిన విగ్రహాలను ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు.. పలువురు సెలబ్రెటీలు ప్రచారం చేస్తున్నారు.
  • వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఆ నీరంతా కాలుష్యమౌతుంది
Govt urges cut in height of Ganesh idols

 

వినాయకచవితి మరెంతో దూరంలో లేదు... వినాయకచవితిని దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. వూరూరా.. వాడ వాడ.. వినాయకుని విగ్రహాన్ని  ప్రతిష్టించి.. పూజలు నిర్వహిస్తారు. కొందరు.. 3 రోజులు, మరికొందరు 5 రోజులు, మరికొందరు .. 9,11 రోజుల పాటు పూజలు చేసి.. ఆ తర్వాత పెద్ద వూరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేస్తారు.

మా ఏరియాలో వినాయకుడి విగ్రహం పెట్టాము అని చెప్పగానే.. అందరూ అడిగే కామన్ ప్రశ్న.. ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారు అని. వినాయకచవితికి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పోటీలు పడి మరీ.. పెద్ద పెద్ద విగ్రహాలను పెడుతుంటారు. అయితే.. ఇది పర్యవారణానికి హాని చేస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా.. మట్టితో చేసిన విగ్రహాలను ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు.. పలువురు సెలబ్రెటీలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలకు కొందరిలో మార్పు వచ్చింది. అందరూ కాకపోయినా కొందరు మట్టి విగ్రహాలను పూజిస్తున్నారు. ఇంకా చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఆ నీరంతా కాలుష్యమౌతుంది. అలాగే.. పెద్ద విగ్రహాలను వూరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో కరెంటు తీగలకు తగిలే ప్రమాదం ఉంది.. వాటిని నిమజ్జనం చేయడం కూడా అంత సులువేమీ కాదు.  అందుకే పెద్ద విగ్రహాలు వద్దూ అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే.. విజయవాడ BRTS రోడ్డు వద్ద పర్యావరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల కేంద్రాన్ని విజయవాడ నగర కమీషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కాలుష్యం పెరిగి పోతున్న   సమయం లో  పౌరులు కూడా ప్రకృతి రక్షణ కు తమవంతు సాయం అందించడం వారి భాద్యత అని ఆయన అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే ..మట్టి విగ్రహాల వాడకమే మంచిదన్న కమీషనర్.. వినాయకుడి మండపాల్లో సౌండ్ బాక్సుల వాడకాన్ని కూడా తగ్గించాలని అన్నారు. అలాగే విగ్రహం సైజ్ కంటే మనసులో భక్తి ముఖ్యమని..కాబట్టి పక్కవాళ్ళతో పోటీ అంటూ పెద్ద పెద్ద విగ్రహాల పెట్టడం వల్ల డబ్బు వృధా కావడమే కాకుండా..పర్యావరణానికి కూడ నష్టం చేసిన వాళ్ళమవుతామని ఆయన హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios