Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త: పెట్రోలియం ఉత్పత్తులపై రూ.5 తగ్గే ఛాన్స్, ఎలాగంటే?

గుడ్‌న్యూస్: పెట్రోల్‌పై రూ.5 తగ్గింపుకు కేంద్రం యోచన

Govt may soon cut fuel prices by Rs 4-5


న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రతిరోజూ పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు
తగ్గించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఇదే జరిగితే సుమారు రూ.5 పెట్రోల్, డీజీల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది.


కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రతి రోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని సుమారు 19 రోజుల పాటు కేంద్రం ప్రభుత్వం ఈ  ధరలను
పెంచకుండా జాగ్రత్తలు తీసుకొంది. పోలింగ్ ముగిసిన మరునాడు నుండే ఈ ధరలు పెరుగుతున్నాయి.

రికార్డుస్థాయిలో ధరలు చేరుకోవడంతో వినియోగదారులు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో  ముడి చమురు
ధరలు కూడ పెరగడం ఒక కారణంగా ప్రభుత్వం చెబుతోంది.ఈ తరుణంలో పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు గాను ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలి  కేంద్రం
యోచిస్తున్నట్టు సమాచారం.


 2016-17లో దేశీయ బాస్కెట్‌లో బ్యారల్‌కు 47.56 డాలర్లు పలికిన క్రూడ్‌ ధర, 2017-18 నాటికి 56.43 డాలర్లకు పెరిగింది. మార్చి నాటికి ఇది 63.80 డాలర్లకు, ఏప్రిల్‌ నాటికి మరింత
ఎగిసి 69.30 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారల్‌ క్రూడ్‌ ధర 75 డాలర్లుగా ఉంది. ఇది గతవారం అ‍త్యధిక స్థాయిలో 80 డాలర్లుగా నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడ పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను తగ్గిస్తే  వినియోగదారులపై మరింత భారం తగ్గే అవకాశాలు కూడ ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.ఇంధన ధరలపై విధించే పన్నుల్లో కేంద్రం 25 శాతం, రాష్ట్రాలు విధించే పన్నులు 21.2 శాతం, డీలర్‌ మార్జిన్లు 4.7 శాతం ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios