ఊహించిందే జరిగింది: యడ్యూరప్పకే చాన్స్, రేపు ఉదయమే ప్రమాణం

First Published 16, May 2018, 8:39 PM IST
Governor invites Yeddyurappa to form govt
Highlights

కాంగ్రెసు, జెడిఎస్ కూటమి అనుమానిస్తున్నట్లుగానే జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా బిజెపి శాసనసభా పక్ష నేత యడ్యూరప్పను ఆహ్వానించారు.

బెంగళూరు: కాంగ్రెసు, జెడిఎస్ కూటమి అనుమానిస్తున్నట్లుగానే జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా బిజెపి శాసనసభా పక్ష నేత యడ్యూరప్పను ఆహ్వానించారు. ఆయన రేపు గురువారం ఉదయం 9,30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేయనున్నారు.

రేపు ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. బలనిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. ఈ నెల 29వ తేదీలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ వాజుభాయ్ వాలా యడ్యూరప్పను ఆదేశించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. 

గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెసు నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని కాంగ్రెసు న్యాయవాది రవిశంకర్ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

loader