తెలంగాణ రాష్ట్రం లో మొదటి స్వాతంత్య్రం దినోతవ్సం మొదలుకుని మొదటి రాష్ట్రావతరణ దినోత్సవం దాకా, పార్టీ మీటింగులు మొదలుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల దాాకా ఉద్యోగాల గురించి లెక్కలేనన్ని ప్రకటనలు. ఈ వరసలో ఇపుడు 700 విఆర్ వో పోస్టులు అని నోరూరిస్తున్నది ప్రభుత్వం. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరపండి వెంటనే అనే అదేశాలొస్తాయి. నోటిఫికేషన్ లు మాత్రం రావడం లేదు... ఈ జాబితాలో  700 పోస్టు లూ చేరుతాయా?

తెలంగాణ రాష్ట్రం లో మొదటి స్వాతంత్య్రం దినోతవ్సం మొదలుకుని మొదటి రాష్ట్రావతరణ దినోత్సవం దాకా, పార్టీ మీటింగులు మొదలుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల దాాకా

ఉద్యోగాల గురించి లెక్కలేనన్ని ప్రకటనలు. ఈ వరసలో ఇపుడు 700 విఆర్ వో పోస్టులు అని నోరూరిస్తున్నది ప్రభుత్వం. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరపండి వెంటనే అనే అదేశాలొస్తాయి.

 నోటిఫికేషన్ లు మాత్రం రావడం లేదు... ఈ జాబితాలో 700 పోస్టు లు చేరుతాయా?

మొదట ముఖ్యమంత్రో, ఆ శాఖ మంత్రో ఒక తొందరగా ఉద్యోగాలు నింపండి అని ప్రకటిస్తారు.

ఒక సారి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుంది.

 మరో సారి ముఖ్య మంత్రి పచ్చ జెండా వూపునట్లు పత్రికలలో తాటికాయంత అక్షరాలు, టివిలో వార్ మ్యూజిక్ పెట్టి ప్రకటిస్తారు.

ఆ తర్వాత వెంటనే సన్సేషన్ వార్త. కొత్త ఉద్యోగాల రిక్రూట్ మెంట్ కు టిఎస్ పి ఎస్ సి కసరత్తు...అని వస్తుంది...

 వీటికోసం ఎదురు చూసి, కోచింగ్ లు తీసుకుని విసిగి వేసారిని నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతారు. క్యాంపస్ ధర్నా అంటారు..ఈ వార్త ఎక్కడ కనిపించదు.

పోనీలే, ఇప్పటికిలా సంతోషించండి... కింది వార్త చదివి

1865 పోస్టులకు ప్రభుత్వం పచ్చ జెండా.

ఇందులో రెవిన్యూశాఖ లో 1506 ఖాళీలుంటాయి.పంచాయతీ రాజ్ శాఖలో 359 పోస్టులుటాయి.వీటిని వెంటనేనింపేపని చేపట్టాలని ప్రభుత్వం టిఎస్ పిఎస్ సిని అదేశించిందట.

రెవిన్యూ శాఖలో పోస్టులు

డిప్యూటి సర్వేయర్లు -110

సిసిఎల్ ఎ జూనియర్ అసిస్టెంట్లు- 21

డిప్యూటి కలెక్టర్లు- 08

డిప్యూటి తాహశీల్దార్లు- 38

జిల్లాలలో జూనియర్ అసిస్టెంటులు, టైపిస్టుల-400

విఆర్ వొ లు-700

డిప్యూటీ సర్వేయర్లు- 210

కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్-50

జిల్లా రిజిస్ట్రార్లు-07

సబ్ రిజిస్ట్రార్లు‘22

జూనియర్ అసిస్టెంట్లు (రిజిస్ట్రేషన్ శాఖలో)-50

పంచాయతీ రాజ్ శాఖలో...

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు-277

అసిస్టెంట్ ఇంజనీనర్లు -82