తిండి. ... తిండి..తండి... తిండి తగ్గించడమెలా... మంచి తిండెక్కడ దొరుకుతంది. అందరి యావ ఇదే. ప్రపంచమంతా ఇదే యావ... ఈ విషయం బయటపెట్టిందెవరో కాదు... గూగుల్.  ఇంతకీ విషయం ఏమిటంటారా..పాత సంవత్సరం అదేనండి.. 2017లో ఎక్కువ మంది దేని గురించి సెర్చ్ చేశారో.. గూగుల్ గతంలోనే ప్రకటించింది. తాజాగా నూతన సంవత్సరంలో దేని గురించి సెర్చ్ చేశారో కూడా చెప్పేసింది. 2018లోకి మనమందరం అడుగుపెట్టి సరిగ్గా వారం రోజులు గడిచింది. అందుకే ఈ మొదటి వారంలో ప్రజలు ఏ విషయం గురించి ఎక్కువ సెర్చ్ చేశారో.. గూగుల్ బయటపెట్టింది. ఇంతకీ ఎక్కువ మంది సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా.. బరువు తగ్గడం. బరువు తగ్గడానికి ఏం చేయాలి..? ఎలాంటి వ్యాయామాలు చేయాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లాంటి ప్రశ్నలను గూగుల్ లో వెతికారు. ఇది కూడా ఎక్కువ మంది వెతికింది వాతావరణం గురించి. ఏ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది..?  ఏ ప్రాంతాల్లో వెచ్చగా ఉంటుంది లాంటి ప్రశ్నలు కూడా వెతికారు.

అంతేకాదు చాలా మంది..‘ జిమ్ నియర్ మి’ కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. ‘న్యూ ఇయర్ డైట్’ మీద దృష్టిపెట్టిన వారి సంఖ్య ఈ వారం 200శాతానికి పెరిగింది. మరికొందరేమో.. చిన్నపిల్లలకు న్యూ ఇయర్ రెసల్యూషన్స్ కోసం సెర్చ్ చేయగా.. ఇంకొందరేమో.. న్యూ ఇయర్ రెసల్యూషన్ వెనక ఉన్న కథ గురించి వెతికారు. ‘‘ బాంబ్ సైక్లోన్ అంటే ఏమిటి..?’’ ‘‘ పైపులు గడ్డకట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి?’’, ‘‘ గడ్డ కట్టిన పైపులను ఎలా ఫిక్స్ చేయాలి..?’’ లాంటి విషయాల గురించి వెతికారు.