Asianet News TeluguAsianet News Telugu

లోకేశ్ సక్సెస్, విశాఖ రానున్న గూగుల్ ఎక్స్

విశాఖకు రానున్న గూగుల్  ఎక్స్... లోకేశ్ కృషి ఫలించింది.

Google X to set up  first overseas  centre in Visakhapatnam

సెల్ఫ్ డ్రెవింగ్ కార్ల తయారీలో ఉన్న గూగుల్ ఎక్స్ ను విశాఖ తెప్పించడం లో ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ విజయవంతమయ్యారు. చిత్రమేమిటంటే, ఈ విషయంలో ఆయన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పోటీ పడ్డారు. 17 సంవత్సరాల కిందట మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ రప్పిండంలో చంద్రబాబు నాయుడు విజయవంతమయితే,  లోకేష్ గూగుల్  ఎక్స్ మొట్టమొదటి విదేశీ సెంటర్ ను విశాఖ కు తీసుకువస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌  ఏర్పాటు చేస్తారనేది ఒక బిగ్ న్యూస్. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఇపుడు అమెరికా పర్యటనలో ఉన్న  మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదురింది.  త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఏపీ 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ (FSOC) లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేస్తుంది.మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల FSOC లింక్స్  ను గూగుల్ ఎక్స్ అందిస్తుంది.

ఈ సరికొత్త టెక్నాలజీతో  తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ సౌకర్యం రానుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్ వెల్లడించారు. గూగల్ ఎక్స్ అనేది గూగుల్ కుచెందినసెమీ సీక్రెట్ రిసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్. దీనిని గూగుల్ 2010లో ఏర్పాటుచేసింది. ఆల్ఫాబెట్ ఇన్ కార్పొరేటెడ్ అనుబంధసంస్థగా పనిచేస్తు గూగుల్ ఎక్స్ సెల్ప్ డ్రెయివింగ్ తయారీలో నిమగ్నమై ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios