ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో మార్పులు చేశారు. గూగుల్ నుంచి ఇష్టానుసారంగా మనం ఫోటోలను సేవ్ చేసుకునేందుకు లేదు. ‘వ్యూ ఇమేజ్‌’ బటన్‌ను తొలగించేసింది.

ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్‌ చేసినప్పుడు పక్కన విజిట్‌, షేర్‌లతోపాటు వ్యూ ఇమేజ్‌ ఆప్షన్‌ కూడా కనిపించేది. దానిని క్లిక్‌ చేస్తే ఆ ఫోటో  పెద్దదిగా ఓపెన్‌ అయ్యి మనం డౌన్ లోడ్ లేదా సేవ్‌ చేసుకునే సౌఖర్యం  ఉండేది. అయితే కాపీ రైట్స్‌ సమస్య ఎక్కువగా వస్తోందని ఆ ఆప్షన్‌ను గూగుల్‌ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్‌ లో కేవలం విజిట్‌, షేర్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.

‘గూగుల్‌లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్‌ పేర్కొంది.