ప్రముఖ సాఫ్ట్‌ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన స్మార్ట్‌ ఫోన్లు పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్‌  ధరలపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ ఫోన్లను గూగుల్  గత ఏడాది విడుదల చేసిన విషయం విదితమే. ఫోన్లను భారత మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు వీటి  ప్రారంభ ధర లు రూ.61వేలు, రూ.73వేలుగా ఉండేవి. అయితే గత డిసెంబర్ నెలలో ఈ ఫోన్ల ధరలను గూగుల్ కాస్త తగ్గించింది. దీంతో చాలా తక్కువ ధరకే ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

కాగా.. తాజాగా మరోసారి వీటి ధరలను గూగుల్ తగ్గించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్లపై రూ.11000, రూ.8000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనికి తోడు సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను కొంటే అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ కలుపుకుని ఇప్పుడు గూగుల్ పిక్సల్ 2 ఫోన్లు కింద ఇచ్చిన ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. 

గూగుల్ పిక్సల్ 2 (64 జీబీ) - రూ.41,999
గూగుల్ పిక్సల్ 2 (128 జీబీ) - రూ.50,999

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (64 జీబీ) - రూ.54,999

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (128 జీబీ) - రూ.63,999
ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పలు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో గూగుల్ పిక్సల్ 2 ఫోన్లను వినియోగదారులు తగ్గింపు ధరలకు కొనవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్లను కొంటే రూ.18వేల వరకు పాత ఫోన్లకు ఎక్స్‌ ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఫోన్లను కొనుగోలు చేసిన 90 రోజులకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు ధరల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంటుంది.