గూగుల్ తేజ్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యాప్ తో ఇప్పటి వరకు ఒకరి దగ్గర నుంచి మరొకరికి సులభంగా డబ్బులు పంపించుకోవచ్చు. ఈ యాప్ విడుదలైన కొద్ది రోజుల్లోనూ చాలా పాపులర్ అయ్యింది. ఎవరికైనా అర్జెంట్ గా మనీ పంపించాలి అంటే చాలు.. అందరూ.. తేజ్ యాప్ వైపే చూస్తున్నారు.

కాగా.. తాజాగా ఈ యాప్ లో అదనపు ఫీచర్లు తీసుకువచ్చారు. ఇక నుంచి ఈ యాప్ లో ఛాటింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే దీన్ని పూర్తిస్థాయి ఛాటింగ్ యాప్ అనడానికి లేదు. కేవలం ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు దేనికోసం పంపుతున్నాం లాంటి చిన్న చిన్న మెసేజీలు పంపుకోవడానికి వీలు కల్పిస్తుంది.

చాలారోజుల క్రితమే పేటీఎం సంస్థ తన అప్లికేషన్ వల్ల మిత్రులతో ఛాటింగ్ చేసుకునే అవకాశాన్ని తీసుకువచ్చింది. దీంతో.. పేటీఎంకి పోటీగా తేజ్ కూడా మెసేజ్ లు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.