వరంగల్ ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలియజేశారు. వరంగల్ పట్టణంలో టెక్ మహీంద్రా కంపెనీని త్వరలోనే స్థాపించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా స్విట్జర్లాండ్ లోని దావోస్  పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  

కాగా.. అక్కడ కేటీఆర్ టెక్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణంలో టెక్ మహీంద్రా కంపెనీని స్థాపించాల్సిందిగా కేటీఆర్ ఆయనను కోరారు. దీనికి ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వరంగల్ లో కంపెనీ పెడతామని ప్రకటించారు. ఇది కనుక అమలౌతే.. తెలంగాణ రాష్ట్రంలో మరికొందరు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.