Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త

తెలుగురాష్ట్రాల నిరుద్యోగులకు ఇది శుభవార్త.  ఎందుకంటే, ఈ రాష్ట్రాలలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు అంతా నాటకం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేయమని ప్రభుత్వాలు చెప్పవు. చెప్పినా పబ్లిక్ సర్వీసన్ కమిషన్ కి సక్రమంగా పరీక్షలు నిర్వహించే శక్తి లేదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నా పత్రం కరెక్టుగా ఉంటుందన్నగ్యారంటీ లేదు. పరీక్ష లయిపోయాక కీ సరిగ్గా ఉండదు. ఈ మధ్యలో ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. పరీక్ష ఆగిపోతుంది. ఇలా తెలుగు నిరుద్యోగులు పడుతున్న యాతన, వారికుటుంబాలు అనుభవిస్తున్న వేదన అంతా ఇంతాకాదు. అందుకే  ఇది శుభవార్త.

good news to unemployed of two Telugu states of andhra and Telangana


తెలుగురాష్ట్రాల నిరుద్యోగులకు ఇది శుభవార్త.  ఎందుకంటే, ఈ రాష్ట్రాలలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు అంతా మోసం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేయమని ప్రభుత్వాలు చెప్పవు. చెప్పినా పబ్లిక్ సర్వీసన్ కమిషన్ కి సక్రమంగా పరీక్షలు నిర్వహించే శక్తి లేదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నా పత్రం కరెక్టుగా ఉంటుందన్నగ్యారంటీ లేదు. పరీక్ష లయిపోయాక కీ సరిగ్గా ఉండదు. ఈ మధ్యలో ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. పరీక్ష ఆగిపోతుంది. ఇలా తెలుగు నిరుద్యోగులు పడుతున్న యాతన, వారికుటుంబాలు అనుభవిస్తున్న వేదన అంతా ఇంతాకాదు. అందుకే  ఇది శుభవార్త.


ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సొనెల్ సెల‌క్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల్లో తెలంగాణకు 1154, ఆంధ్రప్రదేశ్‌కు 771 కేటాయించారు. ఐటీ, మార్కెటింగ్ అగ్రికల్చర్, లా, చార్టెడ్ అకౌంటెంట్ విభాగాల్లోని స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతోపాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఎంపిక చేసే విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దీనిలో రెండు దశలు ఉంటాయి. ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో రీజనింగ్, న్యుమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్‌లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి మైనస్ మార్కులుంటాయి. పరీక్ష స్కోర్ ఆధారంగానే ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.

పరీక్షల గురించిన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జులై 12
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఆగస్టు 1.
ప్రిలిమిన‌రీ పరీక్ష తేది: ఆఫీస‌ర్ స్కేల్‌-I – సెప్టెంబరు 09, 10, 16; ఆఫీస్ అసిస్టెంట్‌- సెప్టెంబరు 17, 23, 24
మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్ష: ఆఫీస‌ర్స్ – నవంబరు 05, ఆఫీస్ అసిస్టెంట్ – నవంబరు 12.
ఇంట‌ర్వ్యూ తేది: డిసెంబ‌రు 2017

 

నోటిఫికేషన్: http://www.freejobalert.com/wp-content/uploads/2016/11/Notification-IBPS-CRP-RRB-VI-Posts1.pdf

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్: http://www.ibps.in/

Follow Us:
Download App:
  • android
  • ios