నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. పని  ఒత్తిడి తక్కువగా ఉండి.. జీతం ఎక్కువగా లభించే ఉద్యోగాన్ని కావాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని తపాలశాఖ అందిస్తోంది. పోస్టుమెన్, మెయిల్ గార్డ్ పోస్టులకు తపాలాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని అలెవన్స్ లు కలుపుకొని ప్రారంభ జీతం రూ.25వేలు ఉంటుంది. కనీస విద్యార్హత పదోతరగతి. www.appost.in, www.indiapost.in ఈ రెండు వెబ్ సైట్లలో ఏదో ఒకదానిలో లాగిన్ అయ్యి.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

అప్లికేషన్‌ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదుకు మార్చి 15 చివరితేదీ, హెడ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి మార్చి 16 చివరితేదీ.  ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు మార్చి 20 చివరితేదీ గా ప్రకటించారు. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగం లభిస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 245 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.