నిరుద్యోగులకు రైల్వేశాఖ మరో శుభవార్త వినిపించింది. గత నెలలో రైల్వేశాఖ గ్రూప్ సీ, గ్రూప్-డీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.89,409 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వేశాఖ.. ఇటీవలే విద్యార్హత తగ్గించారు. కాగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ గ్రూప్-సీ, గ్రూప్ -డీ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో.. చాలా మంది నిరుద్యోగులకు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పరీక్షకు దరఖాస్తు తేదీని కూడా మార్చి 31 వరకు పొడిగించారు.

పెంచిన వయోపరిమితి ప్రకారం.. అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు సంబంధించి..జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 28 నుంచి 30 సంవత్సరాలకు, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 31 నుంచి 33 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ ​కేటగిరి  అభ్యర్థులకు 33 నుంచి 35 సంవత్సరాలకు పొడిగించింది. ఇక  గ్రూపు డి ఉద్యోగాలకు సంబంధించి... జనరల్‌ అభ్యర్థులకు 31 నుంచి 33, ఓబీసీ అభ్యర్థులకు 34 నుంచి 36, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 36 నుంచి 38కి పెంచారు.