వేడి వేడి టీ.. కంటికి ఎంతో మేలు

good news for tea lovers Drinking hot tea daily cuts the risk of Glaucoma
Highlights

  • టీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో..

ఉదయం లేవగానే.. కప్పు టీ గొంతులో పడితే కానీ.. చాలా మంది బెడ్ దిగరు. కొందరైతే.. రోజంతా ఏమీ తినకుండా అయినా ఉంటారేమో కానీ.. టీ తాగకుండా మాత్రం ఉండలేరు. అలాంటి వాళ్లకి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే.. రోజుకి ఒకసారి వేడి వేడిగా టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పలువురు నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వయసు పెరిగే కొద్ది.. అందరిలో కంటి సమస్యలు మొదలౌతాయి. వాటిని టీ తాగడం ద్వారా కాస్త తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. టీ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరో ప్రొటక్టివ్ కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కంటి సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటాయి.

 పెద్దలు, పిల్లలు కలిపి దాదాపు 10000 మందిపై పరిశోధకులు పరిశోధనలు జరిపారు. కాగా.. ప్రతిరోజు ఒక కప్పు వేడి టీ తీసుకునేవారిలో కంటి సంబంధిత వ్యాధులు రావడం లేదని తేలింది. అయితే.. కచ్చితంగా టీ తాగితే.. కంటి చూపు కి సంబంధించిన సమస్యలు రావు అని చెప్పడం లేదు. కాకపోతే.. వచ్చే ఆస్కారం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

loader