నిరుద్యోగులకు మరో శుభవార్త.. వేలల్లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు మరో శుభవార్త.. వేలల్లో ఉద్యోగాలు

సరైన ఉద్యోగం లభించక.. నిరుత్సాహంతో ఉన్న ఉద్యోగార్థులకు శుభవార్త. ఈ ఏడాది దాదాపు 140 కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. wisdomjobs.com అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 2018లో తిరిగి ఉద్యోగాలు భారీస్థాయిలో లభించబోతున్నాయి. మొత్తం 140 కంపెనీలు, IT, రిటైల్, హాస్పిటాలిటీ, FMCG, హెల్త్‌కేర్, ఆటోమొబైల్స్, మౌలిక సదుపాయాలు, విద్య, ITeS, BFSI వివిధ రంగాలకు సేవలందిస్తున్న సంస్థల నుండి సేకరించిన సర్వేలో 2018 చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఆ తర్వాత H-1B వీసాల నిబంధనలు, GSTని అమలులోకి తీసుకు రావడం వంటి వివిధ కారణాల వలన 2017లో దాదాపు అధికశాతం రంగాల్లో క్లిష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవటంతోపాటు ఇప్పటికే వున్న వారికి స్కిల్ డెవలప్మెంట్, అప్‌స్కిల్లింగ్, ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వారి నైపుణ్యాలు పెంపొందించాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న 60 శాతం కంపెనీలు ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త నియామకాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. మరో 30 శాతం కంపెనీలు స్టార్టప్‌ల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి నిర్దిష్టమైన వ్యూహంతో నియామకాలు చేపట్టబోతున్నట్లు తెలిపాయి. దాదాపు 58 శాతం కంపెనీలు HR కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తున్న నిధులను మరో 10శాతం పెంచబోతున్నట్లు తెలిపాయి. మరో 10 శాతం కంపెనీలు ఇప్పటికీ ఉన్న నిధులకి అదనంగా మరో 20 శాతం ఇవే ప్రైవేటు కార్యక్రమాలకు వెచ్చించబోతున్నట్లు పేర్కొన్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page