‘హలో’ అంటున్న జియో

First Published 18, Dec 2017, 4:02 PM IST
good news for jio sim users my jio aap for android users hello jio voice assistant support
Highlights
  • ‘హలో జియో’ పేరిట వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • ఈ ఫీచర్.. ఇప్పటికే జియో ఫోన్ వాడుతున్న వారికి అందుబాటులో ఉంది.
  • కాగా.. తాజాగా జియో సిమ్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది.

జియో వినియోగదారులకు శుభవార్త. జియో సిమ్ వినియోగదారులకు ఆ కంపెనీ.. కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హలో జియో’ పేరిట వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్.. ఇప్పటికే జియో ఫోన్ వాడుతున్న వారికి అందుబాటులో ఉంది. కాగా.. తాజాగా జియో సిమ్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది. కాకపోతే ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ వాయిస్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్ భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే ఇతర రీజనల్ లాంగ్వేజీలలో సపోర్ట్ చేసేలా అప్ డేట్ చేయనున్నారు. జియో యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, హల్లో జియో వాయిస్ అసిస్టెంట్‌లోకి వెళ్లిపోవచ్చు. మైజియో అప్లికేషన్లలో మీకు ఇది కనిపిస్తుంది.

ఈ ‘హలో జియో’ ని ఉపయోగించి.. మీరు  రోజుకి ఎన్ని ఎస్ఎంఎస్ లు పంపించారు, మీ డేటా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇలాంటి అన్ని ప్రశ్నలు మీరు అడగవచ్చు. జియోకి సంబంధించిన ఎలాంటి ప్రశ్న అడిగినా మీకు వెంటనే సమాధానం వస్తుంది.

loader