ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ కంపెనీలకు చెందిన వస్తువులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అమలు చేస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఈ ఆఫర్లను ప్రకటించింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కి చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, యాపిల్ వాచ్, ఐప్యాడ్ లను కొనుగోలను చేయాలి. అప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈఎంఐ విధానాన్ని కూడా అందుబాటులో ఉండటం విశేషం.

ఐఫోన్ X ఫోన్ పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 8పై 7వేలు, ఐఫోన్ 8ప్లస్ ఫోన్ పై 7వేలు, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లపై రూ.3వేలు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్6ఎస్ ఫ్లస్ ఫోన్ లపై రూ.2వేలు. ఐఫోన్6, ఐఫోన్5ఎస్, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లపై రూ.వెయ్యి క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇక ఐఫ్యాడ్ లపై రూ.5వేలు, మ్యాక్ బుక్ పై రూ.10వేలు, యాపిల్ వాచ్ పై రూ.5వేలు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.