ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరిలు ప్రతిష్టాత్మక ‘ గోల్డెన్ పికాక్’ అవార్డుకు ఎంపికయ్యారు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరిలు ప్రతిష్టాత్మక ‘ గోల్డెన్ పికాక్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 25న లండన్ లో నిర్వహించతలపెట్టిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు ఈ అవార్డులను అందుకోనున్నారు. లీడర్ షిప్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ గవర్నెన్స్ విభాగంలో చంద్రబాబుకి ఈ అవార్డును అందజేస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ కేటగిరిలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ ఎంపికైంది. ఆ సంస్థ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో నారా భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు.
