పది గ్రాముల పసిడి ధర రూ.30,050 కేజీ వెండి ధర రూ.40,200
బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. ఈరోజు బంగారం ధర రూ.30వేల మార్క్ ని దాటింది. రూ.300 పెరిగి పది గ్రాముల పసిడి ధర రూ.30,050కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, స్థానిక వ్యాపారుల వద్ద నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. ఈరోజు వెండి ధర రూ.40వేల మార్క్ ని దాటింది. రూ.900 పెరిగి కేజీ వెండి ధర రూ.40,200కు చేరుకుంది. వెండి నాణేల కొనుగోళ్లు పెరగడంతో వెండి ధర పెరిగిందని బులియన్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో 0.43శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,288 డాలర్లకు చేరుకుంది. 0.12 శాతం పెరిగి ఔన్సు వెండి ధర 17.12 డాలర్లకు చేరుకుంది.
దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.30,050 గా ఉండగా... 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.29,900గా ఉంది.
