పెరిగిన బంగారం, వెండి ధరలు

First Published 3, Mar 2018, 4:30 PM IST
Gold regains sheen on firm global cues jewellers buying
Highlights
  • అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. పెరిగిన బంగారం ధర

గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. మళ్లీ బంగారానికి రెక్కలు వచ్చాయి. నేటి మార్కెట్లో రూ.140 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.31,500కి చేరింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ లోడిమాండ్ ఎక్కువ కావడంతో.. బంగారం ధర పెరిగినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈరోజు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర నేడు రూ.320 పెరిగి రూ.39,530కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగినట్లు  మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.43 శాతం పెరిగి 1,322.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం పెరిగి 16.51డాలర్లుగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల పదిగ్రాముల బంగారం ధర రూ.31,500గా ఉంది. 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.31,350గా ఉంది.

loader