మూడు నెలల గరిష్టానికి బంగారం ధర

First Published 2, Jan 2018, 12:16 PM IST
Gold Prices Hit More Than Three Month High
Highlights
  • నేటి మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో బంగారం ధర ఆకాశానికి ఎగిరింది. 2017 ఏడాది చివరి మాసంలో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టినా.. నూతన సంవత్సరంలో మళ్లీ కోలుకుంది. ఏకంగా మూడు నెలల గరిష్టానికి బంగారం ధర చేరిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో 0.2 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,305.93 డాలర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ లో ఔన్సు బంగారం ధర 1,307.63 డాలర్లు ఉండగా.. అంత మొత్తంలో మళ్లీ బంగారం ధర చేరుకోవడం ఇప్పుడే.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా... హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.28,100. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,654గా ఉంది. విజయవాడ నగరంలో 22క్యారెట్ 10గ్రాముల బంగారం ధర రూ.28,100, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,654గా ఉంది. విశాఖ నగరంలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.28,100గా ఉండగా, 24క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.30,654గా ఉంది. ఇక కేజీ వెండి ధర మూడు నగరాల్లోనూ రూ.42వేలకు చేరింది.

loader