Asianet News TeluguAsianet News Telugu

భారీగా పెరిగిన బంగారం ధర

  • తులం బంగారం ధర రూ.31,350
  • కేజీ వెండి ధర రూ.42 వేలు
Gold prices hit 11month high of Rs313530 on global cues

బంగారానికి రెక్కలు వచ్చాయి. ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది. ఈ ఏడాది అత్యధికంగా పసిడి ధర పెరిగింది ఈ రోజే.అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

ఈ రోజు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.31శాతం పెరగడంతో ఔన్సు 1,352.80డాలర్లు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios