Asianet News TeluguAsianet News Telugu

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

  • తగ్గిన వెండి, బంగారం ధరలు
Gold Prices Fall Today Extending Wednesdays Rs460 Decline

వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం రూ.460 తగ్గిన బంగారం ధర.. గురువారం మరింత తగ్గింది. రూ.30 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.31,360కి చేరుకుంది. ఈ రోజు వెండి ధర కూడా తగ్గింది. నిన్నటి మార్కెట్లో రూ.250 తగ్గిన వెండి ధర ఈ రోజు మరో రూ.90 తగ్గింది. దీంతో..కేజీ వెండి ధర రూ.39,210కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో.. పసిడి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. సింగపూర్ మార్కెట్లో 0.30శాతం తగ్గి.. ఔన్సు బంగారం ధర 1,313.80 డాలర్లకు చేరుకుంది. 0.34శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.33 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,360గానూ, 99.5శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.31,210 గానూ ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios