బంగారం ధర రూ.29,150 వెండి ధర రూ.38,750

బంగారం విలువ ఈరోజు కూడా పెరిగింది. రూ.100 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.29,150కి చేరింది.
ఓవర్సీస్ మార్కెట్లో, స్థానికంగా కొనుగోళ్లు పెరగడం వలన బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో
ఔన్సు బంగారం ధర 0.23శాతం పెరిగి 1,246 డాలర్లకు చేరింది. ఈరోజు వెండి ధర కూడా పెరిగింది. రూ.250 పెరిగి 
 కేజీ వెండి ధర రూ.38,750కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 16.36 డాలర్లకు చేరింది. 
 దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం విలువ రూ.29,150.. 99.5శాతం 
స్వచ్ఛత గల బంగారం విలువ రూ.29,000గా ఉంది.