Asianet News TeluguAsianet News Telugu

భారీగా పడిపోయిన బంగారం ధర

  • భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
Gold Prices Dip On Low Demand Global Cues and silver also falls down

బంగారం ధర భారీగా పడిపోయింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర మరోసారి తగ్గింది. శుక్రవారం నాటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.31,250 చేరింది. దీంతో బంగారం ధర నెలరోజుల కనిష్ఠానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా బలహీన పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో  పసిడి ధర పడిపోయిందని బులియన్ ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. రూ.150 తగ్గి కేజీ వెండి ధర రూ.39,250కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల డిమాండ్ మందగించడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయ బలహీన పరిణామాలు, వచ్చేవారం జరగనున్న ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, బంగారంలో పెట్టుబడులు తగ్గడం ఇవన్నీ పసిడి ధర పతనానికి కారణమయ్యాయి. అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గింది. 0.64శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,315.70డాలర్లుగా ఉంది. 0.85శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.37డాలర్లకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.31,250గా ఉండగా.. 99.5 శాతం స్వచ్ఛతగల పసిడి ధర రూ.31,100కు చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios