రెండు రోజుల నుంచి అనూహ్యంగా బంగారం , వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
పతనమవుతున్న బంగారం ధరకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది.
కొనుగోళ్లు పెరుగుతుండటంతో 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ.175 పెరిగి రూ.28,200 గా నమోదైంది.
అలాగే, వెండి రేటు కూడా స్వల్పంగా పెరిగింది.
కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 39,500 గా నమోదైంది. నిన్నటితో పోల్చిచూస్తే రూ.350 పెరిగినట్లైంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి అనూహ్యంగా బంగారం , వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
