ఎల్లుండే అక్షయ తృతీయ... తగ్గిన బంగారం ధర

ఎల్లుండే అక్షయ తృతీయ... తగ్గిన బంగారం ధర

ఈ నెల 18వ తేదీ అక్షయ తృతీయ. ఈ రోజు ప్రత్యేకత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ  అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే.. చాలా మంచిదని భారతీయుల నమ్మకం. అందుకే అందరూ ఆ రోజు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం ధర గురించి ఆలోచించరు. గ్రాము బంగారమైనా కొంటారు. ఈ అక్షయ తృతీయ మాత్రం పసిడి కొనుగోలు దారులకు కాస్త కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు పైకి ఎగియగా.. సోమవారం నాటి మార్కెట్‌లో మాత్రం మళ్లీ కిందకి పడిపోయాయి. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడం, అంతర్జాతీయంగా ట్రెడ్‌ ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్‌లో వంద రూపాయలు తగ్గి, 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. సిల్వర్‌ ధరలు కూడా వంద రూపాయలు తగ్గి కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి. 

అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తుండటమే కాకుండా.. జువెల్లర్స్‌ కొనుగోళ్లు తక్కువ చేపడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ కిందకి పడిపోయాయని బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా ఉంది. సిల్వర్‌ 0.36 శాతం తగ్గి 16.57 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 100 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.32వేలుగా, రూ.31,850గా రికార్డయ్యాయి. శనివారం ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా రూ.300 మేర చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos