Asianet News TeluguAsianet News Telugu

తగ్గిన బంగారం, వెండి ధరలు

  • పది గ్రాముల బంగారం ధర రూ.30,275
  • కేజీ వెండి ధర రూ.39,925
Gold loses sheen down Rs 275 on weak demand

బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.రూ.275 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.30,275కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర 0.04శాతం తగ్గడంతో ఔన్సు బంగారం  1,265.70 డాలర్లకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల పది గ్రాముల బంగారం ధర రూ.275 తగ్గి రూ.30,275కి చేరగా, 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.30,125కి చేరింది.

మరో వైపు వెండి ధరలు కూడా తగ్గింది. శుక్రవారం వెండి ధర రూ.40వేల మార్కుకు తగ్గింది. కేజీ వెండి ధర రూ.525 తగ్గి, రూ.39,925కి చేరింది. నాణేల తయారీ నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో 0.42 శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.70 డాలర్లకు చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios