పసిడి ధర మళ్లీ తగ్గింది. గత వారం  వరసగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గింది. రూ.100 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.31,700కిచేరింది. స్థానిక జ్యూయలరీ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో.. బంగారం ధర పడిపోయిందని బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. వెండి ధర కూడా మంగళవారం మార్కెట్లో భారీగా పడిపోయింది. రూ.535 తగ్గి  కేజీ వెండి ధర రూ.39,440కి చేరింది. పరిశ్రమల నుంచి వెండి కోనుగోళ్లు మందగించడంతో ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి.  0.62శాతం తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,337.70 డాలర్లకు చేరింది. 1.05శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.47 డాలర్లకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.31,700గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛత గల పదిగ్రాముల బంగారం ధర రూ.31,550గా ఉంది.