బంగారం ధర మరోసారి తగ్గింది. గురువారం నాటి మార్కెట్లో రూ.220 తగ్గిన పసిడి ధర నేడు మరింత తగ్గింది. శుక్రవారం నాటి మార్కెట్లో రూ.100 తగ్గి పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరింది.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం కారణంగా పసిడి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

  వెండి ధర కూడా ఈ రోజు తగ్గింది. నిన్నటి మార్కెట్లో రూ.400 తగ్గిన వెండి ధర ఈ రోజు రూ.115 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,385కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.27శాతం తగ్గి 1,318 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.21శాతం తగ్గి 16.43డాలర్లుగా ఉంది.