మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు..

మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు..

వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల బంగారం ధర(24క్యారెట్స్) రూ.175 పెరిగి రూ.29,700కి చేరింది. బంగారం కొనుగోళ్లపై స్థానిక ఆభరణాల తయారీదారులు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా ఉండటం బంగారం ధర పెరుగుదలపై ప్రభావం చూపాయని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పసిడి బాటలోనే వెండి పయనించింది. రూ.150 పెరిగి.. కిలో వెండి ధర రూ.38,250కి చేరింది. నాణెల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ వూపందుకోవడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పసిడి ధర 0.18శాతం పెరిగి ఔన్సు 1,264.20 డాలర్లు పలికింది. వెండి 0.15శాతం పెరిగి ఔన్సు 16.16 డాలర్లు పలికింది.
 

హైదరాబాద్ నగరంలో బంగారం ధర..

22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,420
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,912

విజయవాడలో
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,420
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,912

విశాఖపట్నంలో
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,420
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,912
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos