సంక్రాంతి పండగ ఎఫెక్ట్ బంగారం పై పడింది. శనివారం బంగారం ధర మళ్లీ పెరిగింది.  రూ.100 పెరిగి నేటి మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.30,750కి చేరింది. గతేడాది డిసెంబర్ లో కాస్త బంగారం ధర తగ్గుముఖం పట్టినప్పటికీ.. నూతన సంవత్సరంలో మళ్లీ పుంజుకుంది. శనివారం రోజు పసిడి ధర 7 వారాల గరిష్టానికి చేరుకుందని బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అంతర్జతీయ మార్కెట్లో 1.17 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,337.40డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా ఈ రోజు పెరిగింది. రూ.100 పెరిగి కేజీ వెండి ధర రూ.39,900కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 1.44శాతం పెరిగి ఔన్సు వెండి ధర రూ.17.21డాలర్లకు చేరుకుంది. దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల పది గ్రాముల పసిడి ధర రూ.30,750కాగా, 99.5శాతం స్వచ్ఛతగల పది గ్రాముల వెండి ధర రూ.30,600కి చేరుకుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం కారణంగా వెండి, బంగారం ధరలు పెరిగినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.