అమ్మాయిలను ఆకర్షించేందుకు అబ్బాయిలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. స్టైల్ గా డ్రెస్ చేసుకొని అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటారు.  అయితే.. నిజంగా అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా..? దీనిపై కొందరు పరిశోధన కూడా చేశారు. కొందరు అమ్మాయిలపై ఈ విషయంలో సర్వే చేయగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అబ్బాయిలకు గడ్డం లేకపోతే అమ్మాయిలు పెద్దగా ఇష్టపడరట. మీసం, గడ్డం రెండూ పెంచుకుంటేనే ఇష్టపడతారట. అలా కాకుండా మొత్తం మీసంతో సహా క్లీన్ షేవ్ చేసుకున్నా పర్లేదు కానీ.. గడ్డం తీసేసి కేవలం మీసం మాత్రం ఉంచుకోకూడదట. అలాంటి వాళ్లు అమ్మాయిలను పెద్దగా ఆకర్షించలేరు. రఫ్ లుక్ తో ఉన్నవారే తమకు బాగా నచ్చుతారని అమ్మాయిలు తమ మనసులో మాట బయటపెడుతున్నారు.