తప్పిన బాల్య వివాహం.. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు

తప్పిన బాల్య వివాహం.. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారుగా.. పేరు సంధ్య. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనపరిచింది. 86శాతం మార్కులు సాధించింది. ఇప్పుడు ఆమె ఆ మార్కులు సాధించింది అంటే కారణం బాలల హక్కుల సంఘం.ఆ బాలల హక్కుల సంఘమే లేకపోయింటే.. ఇప్పుడు సంధ్య అత్తారింట్లో ఉండేది. 
హయత్ నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సంధ్యకి రెండేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు బాల్య వివాహాం చేయాలని నిశ్చయించారు. పదో తరగతి చివరి పరీక్ష రెండో పేపర్ రాయనీయకుండా పెళ్లి చేయాలనుకున్నారు. విషయం తెలుసుకున్నబాలల హక్కుల సంఘం ఆ పెళ్లిని అడ్డుకుంది. అనంతరం బాలిక ఇంటర్ చదివేందుకు సహకారం అందించారు. ఇప్పుడు వారి సహకారంతోనే ఇంటర్ విద్యను పూర్తి చేసింది.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos