Asianet News TeluguAsianet News Telugu

దేవుడా..! లైన్లో నిలబెట్టి మరీ హాగ్ లు ఇచ్చిన యువతి

దేవుడా..! లైన్లో నిలబెట్టి మరీ హాగ్ లు ఇచ్చిన యువతి

Girl gives hug to boys in lucknow

రంజాన్‌ సందర్భంగా ఆలింగనాలు చేసుకోవడం సాధారణమే. అయితే దానిని మగవారు మాత్రమే చేసుకుంటారు. ముస్లిం సాప్రదాయం ప్రకారం ఆ వర్గానికి చెందిన మహిళలు తెలియని వారికి ఆలింగనాలు ఇవ్వడం చాలా తప్పు. అయితే వీటికి భిన్నంగా చేసి ఓ అమ్మాయి మాత్రం అందరిని షాక్‌కి గురిచేస్తూ ఏకంగా 50మందికి పైగా వరుసబెట్టి హగ్‌ ఇచ్చింది. ఇలా హగ్‌ ఇస్తున్న అమ్మాయిని చూసి అబ్బాయిలు క్యూ కట్టారు. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్‌ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్‌ కోసం పోటీ పడ్డారు. సూమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్‌ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ యువతి ఎవరనే అనే విషయం తెలియదు.

"

Follow Us:
Download App:
  • android
  • ios