సమస్యల పరిష్కారానిని వేదిక మారిన ట్విట్టర్ పరిష్కరిస్తున్న  జీ హెచ్ఎంసీ

ప్రజలు సోషల్ మీడియాను వినోదపరంగానే కాకుండా.. తమ సమస్యల పరిష్కార వేదికలుగానూ వినియోగించుకుంటున్నారు. అధికారులు సైతం వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. జీహెచ్ ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారికంగా ట్విట్టర్ ఖాతను ఉపయోగిస్తోంది. ఈ ట్విట్టర్ ఖాతాకు 20,700మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న మున్సిపల్ కార్యాలయ అధికారిక ట్విటర్ ఖాతా హైదరాబాద్ దే కావడం విశేషం. కాగా.. ఇప్పుడు ప్రజలు ట్విట్టర్ లో తమ సమస్యలను తెలియజేస్తున్నారు. వాటిని అధికార యంత్రాంగం పరిగణలోకి తీసుకొని పరిష్కార దిశగా పనిచేస్తున్నాయి.

ప్రజలు సోషల్ మీడియాను ఈ విధంగా వినియోగించుకోవడం హర్షనీయమని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. దీని ద్వారా గ్రౌండ్ లెవల్లో ఉన్న సమస్యలు అధికారులు సులభంగా తెలుసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

44 విభాగాలకు చెందిన అధికారులు ఈ సమస్యలను పరిశీలిస్తున్నారని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. 92శాతం సమస్యలను పరిష్కరించామని వారు ఈ సందర్భంగా తెలిపారు. డిప్యుటీ కమిషనర్, జోనల్ కమిషనర్లు.. ట్విట్టర్ ఖాతాను మానిటర్ చేస్తూ ఉంటారని వారు చెప్పారు.

కాగా.. సమస్యను పరిష్కరించిన తర్వాత.. ప్రజల దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.